

గూడూరు, మన న్యూస్ :- ఈనెల 6వ తేదీన తిరుపతిలోని ఇందిరా మైదానంలో జరిగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, అంబేద్కర్ పూలే-ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ ఆత్మగౌరవ భరోసా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ మంత్రి మరియు అంబేద్కర్-పూలే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పరసారత్నం కోరారు.ఈ సందర్భంగా గూడూరు పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు తళ్ళం ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ అల్మెన్ రాజు, జానపద కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు యాదగిరి, తిరుపతి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగరాజుగౌడ్, ప్రధాన కార్యదర్శి పాలూరు నాగార్జున రావు తదితరులు పాల్గొన్నారు.
