మన న్యూస్ పాచిపెంట, జూన్ 30:- పార్వతీపురం మన్యం జిల్లాపాచిపెంట ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన కృష్ణాజీ రావు సేవలు జీవితంలో మరువలేమని సీనియర్ ఉపాధ్యాయులు యడ్ల నానాజీ రావు కొనియాడారు.సోమవారం నాడు మండల కేంద్రమైన పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆయన పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.పంచాది కృష్ణాజీరావు ఇంటి వద్ద నుంచి పాచిపెంట ప్రధాన రహదారిలో ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులంతా ఊరేగింపుగా తీసుకెళ్లి ఆయనకు ఘనంగా సత్కరించారు. దారి పొడుగునా పువ్వుల వాన కురిపించారు. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు బంగారం చేసినందుకుగాను ఆయన వెంబడి ఆ పిల్లల తల్లిదండ్రులు పాత ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు కలసి ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ కు హాజరయ్యారు. విజయవంతం చేశారు.అంతేకాకుండా గతంలో తాను ఆధ్యాత్మిక ప్రసంగాలు ద్వారా ఎంతో మంది జీవితాల్లో మార్పు తెచ్చినందుకుగాను సాలూరు,పాచిపెంట, రాంబద్రపురం, బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం బొబ్బిలి పట్టణాలు నుంచి పాత విద్యార్థులు ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు,ఉపాధ్యాయులు,వైద్యులు,రాజకీయ ప్రముఖులు పలువురు ఆయనకు ఘనంగా సత్కరించి వారి రుణం తీర్చుకున్నారు.పాచిపెంట చరిత్రలో ఇంతవరకు పదవి విరమణ కావించిన ఉపాధ్యాయులకు ఇటువంటి ఘన సత్కారాలు,వీడ్కోలు కార్యక్రమాలు జరగడం ఇదే మొదటిసారి అంటూ పలువురు పంచాది కృష్ణాజీకి బ్రహ్మ రధం పడుతున్నారు. ప్రతి ఒక్కరు ఆయన గురించి పొగుడుతూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురుని ఉద్దేశించి మాట్లాడుతూ ఇటువంటి వ్యక్తి మరలా మనకు దొరకడనే బాధతో నిట్టూర్పుతో మాట్లాడారు. రిటైర్మెంట్ అనంతరం ఆయన అరుణాచలం ఆ మహాదేవుడు పరమేశ్వరుడు సన్నిధిలో తన శేష జీవితాన్ని కొన సాగిస్తానని కృష్ణాజీ రావు తెలిపారు. పై కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *