మైనింగ్ కబంధ హస్తాలలో ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి

పేదల పై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తేయాలి – ఏ ఐ కె ఎం ఎస్ జాతీయ కార్యదర్శి బి భాస్కర్

గూడూరు, మన న్యూస్ :- మైనింగ్ కబంధ హస్తాల్లో నీ బంజరు మిగులు భూములను పేదలకు పంచాలని డిమాండ్ తో అడవిలా గా వున్న బంజరు భూమి లో దిగి చెట్టు పుట్ట తొలగించుకొని నిరుపేదలు సాగు చేసుకోవాలని దిగితే సంబంధం లేని వెంకట క్రిష్ణ మైనింగ్ తో పోలీస్ ద్వారా 50 మంది దళితులు పైఅక్రమ కేసు బనాయించడం దారుణమని తక్షణమే పేద ల పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఏ ఐ కె ఎం ఎస్ జాతీయ కార్యదర్శి బి భాస్కర్ డిమాండ్ చేశారు. ఉమ్మడి నెల్లూరు . జిల్లా సదస్సు గూడూరు లోని రిటైర్డ్ ఉద్యోగుల భవనం లో మైనింగ్ కబంద హస్తాలలో నీ మైనింగ్ మిగులు భూములను పేదలకు పంచాలని డిమాండ్ తో జిల్లా సదస్సు కు ఏ ఐ కె ఎం ఎస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు డి పి పోలయ్య అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఈ సభను ఉద్దేశించి అఖిలభారత ఏ ఐ కె ఎం ఎస్ జాతీయ అధ్యక్షులు బి భాస్కర్ మాట్లాడుతూ కేంద్రం లో మోదీ 3.0 ప్రభుత్వం అధికారం చేపట్టాక బడా కార్పోరేట్ కంపెనీలకు అదానీ అంబానీలకు దాసోహం అయిందనీవిమర్శించారు .నూటికి 70 శాతం మంది ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగా న్నీ సైతం కార్పోరేట్ శక్తులకు కట్ట బెట్టడానికిపూనుకుందని ఆరోపించారు.ఈ నూతన వ్యవసాయ విధానం ఆ కోవలో నీదేనన్నారు.అఖిలభారత రైతుకులిసంఘం రాష్ట్ర అధ్యక్షులు టి ప్రకాష్ మాట్లాడుతూప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు వందల వేలఎకరాలుఅప్పనంగాకట్టబెడుతున్నాయనీ ఆరోపించారు.పారిశ్రామిక వాడలు సెజ్ లు హైవేలు పేరు తో వ్యవసాయ భూములను సముద్ర తీర ప్రాంతాలను కార్పొరేట్లపరంచేస్తున్నారన్నారనీ విమర్శించారు.ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు డి పి పోలయ్య మాట్లాడుతూసైదాపురంమండలం లోని ఊటుకూరు గ్రామ సర్వే నంబర్356,359 లో 400 ఎకరాలలో ప్రభుత్వ భూములుఉన్నాయన్నారు.సర్వే నంబర్ 356 లో 215.65 ఎకరాలు మేత పోరంబోకు భూములను ఆగ్రామం లోని భూస్వాములు పెత్తందారులు అక్రమంగా ఆక్రమణ చేసి ఒక్కోక్కరు 5 నుండి 10 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నారన్నారు.భూ స్వాముల ఆక్రమణ లోని భూముల పట్ల రెవిన్యూ యంత్రాంగం కళ్ళు న కబోధిలా వ్యవ హరిస్తుందన్నారు.359 P 2 లో నీ 50 ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదలు ఆక్రమించుకుని చెట్టు పుట్ట తొలగిస్తే మాత్రం రెవిన్యూ అధికారులకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు.గ్రామ పెత్తందారులుఆక్రమించుకున్న భూముల్లో ఎటువంటి నిషేధ బోర్డు లు పెట్ట కుండా కేవలం దళితులు పేదలు సాగు చేసుకుంటున్న ఆ భూముల్లో సైదాపురం మండలం తహశీల్దారు నిషేధ బోర్డు లు పెట్టడమంటే భూస్వాములు తో రెవిన్యూ యంత్రాంగం ఏవిధంగా కుమ్మకైందొ అర్థమైందన్నారు. మార్చి 29న సైదాపురం పోలీస్ స్టేషన్ లో 14 మంది పై మరి కొందరి పై అక్రమ కేసులను పెట్టారన్నారు.కొంతమంది మైనింగ్ యాజమాన్యాలతో రెవిన్యూ యంత్రాంగం పోలీస్ లు కుమ్మకై దళితులు పేదలపై అక్రమ కేసులను పెట్టీ భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా పేదలకు ప్రభుత్వ భూముల ను దక్క కుండా కుట్ర చేస్తున్నారన్నారు.పేదలు సాగు చేసుకుంటున్న 50 ఎకరాల భూములకు హక్కులు కల్పించాలని సైదాపురం మండలం తహశీల్దారు నెల్లూరు ఆర్ డి ఓ జిల్లా కలెక్టర్ కు మొర పెట్టుకున్నా అరణ్య రోదన గా మిగిలిపోయిందన్నారు.
అసైన్మెంట్ చట్టం అనేక సవరణలకు గురైందన్నారు. అసైన్మెంట్ చట్టం అమలులో ఉన్నప్పుడే సుమారు 25 లక్షలకు పైగా అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అయినట్లు కోనేరు రంగారావు కమిషన్ తేల్చిందన్నారు.అన్యాక్రాంతం అయిన అసైన్మెంట్ భూములను లబ్ధిదారులకు దళితులకు పేదలకు ప్రభుత్వంస్వాధీనంచేయాలనీ డిమాండ్ చేశారు. ఐ ఎఫ్ టి యు జాతీయ అధ్యక్షులు ఆరేళ్ళ కృష్ణయ్య మాట్లాడుతూ అఖిల భారత రైతు కూలిసంఘం నాయకత్వంలో భూమి కోసం భుక్తి కోసం అనే నినాదం తో మైనింగ్ కబంధ హస్తాలలో ఉన్న భూములను పోరాడి విడిపించి పేదలకు ఆ భూములను పంచేదాకా వెన్ను చూపకుండా పోరాటాలు సాగిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో ఐ ఎఫ్ టి యు ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కె రమేష్,ప్రగతి శీల మహిళా నాయకురాలు బి మమత, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు డి నవ కోటి, కె చెంగల్ రావు, ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా కార్యదర్శి ఎం అంకయ్య పాల్గొన్నారు.

Related Posts

పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం స్థానిక బాలయోగి నగర్ మరియు ఊర్లపాలెం మెయిన్ పాఠశాలల నందు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ నేడు పదవి విరమణ పొందిన జేడీ సుబ్బారావు మరియు రావినూతల డేవిడ్ జయకుమార్ లను ఘనంగా సన్మానించారు. ముందుగా మండల…

కృష్ణాజీసేవలు మరువలేనివి

మన న్యూస్ పాచిపెంట, జూన్ 30:- పార్వతీపురం మన్యం జిల్లాపాచిపెంట ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన కృష్ణాజీ రావు సేవలు జీవితంలో మరువలేమని సీనియర్ ఉపాధ్యాయులు యడ్ల నానాజీ రావు కొనియాడారు.సోమవారం నాడు మండల కేంద్రమైన పాచిపెంట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు.

నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు.

చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి, పోలీసు, రెవిన్యూ అధికారులు.

చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి, పోలీసు, రెవిన్యూ అధికారులు.

రాష్ట్రస్థాయి క్రీడ పాఠశాలల ప్రవేశ పోటీలలో నారాయణ పేట జిల్లా క్రీడాకారుల ప్రతిభ.

రాష్ట్రస్థాయి క్రీడ పాఠశాలల ప్రవేశ పోటీలలో నారాయణ పేట జిల్లా క్రీడాకారుల ప్రతిభ.

33 కోట్ల రూపాయలతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి.జుక్కల్ ఎమ్మెల్యే తోట

  • By RAHEEM
  • June 30, 2025
  • 8 views
33 కోట్ల రూపాయలతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి.జుక్కల్ ఎమ్మెల్యే తోట

కృష్ణాజీసేవలు మరువలేనివి

కృష్ణాజీసేవలు మరువలేనివి