గూడూరు , మన న్యూస్:- గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమిటీ హాల్ నందు లయన్స్ టౌన్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షుడుగా మోడీబోయిన శీను యాదవ్ , సెక్రెటరీ వెడ్చర్ల వెంకయ్య , ట్రెజరర్ పసుపులేటి ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ గా పైడిమర్రి రాజేంద్రప్రసాద్ , జాయింట్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, జాయింట్ ట్రెజరర్ పల్లమాలప్రభాకర్ , నూతన సభ్యుడు వై జె పి జాయింట్ సెక్రటరీగా వినోద్ కుమార్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కార్యవర్గంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎర్ర బత్తిన గుర్రాథం , పయ్యావులమురళి నాయుడు వైస్ గవర్నర్ ఆర్ వి రావు, క్లబ్ ప్రెసిడెంట్ పట్నం వెంకట మనోజ్ కుమార్ , ట్రెజరర్ గోపీనాథ్ రెడ్డి , రవీంద్రా రెడ్డి , ఎస్ ఎల్ ఎన్ స్వామి, మురళీకృష్ణ , కావేరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం జె ఎఫ్ వై గురునాథం మాట్లాడుతూ 2025- 26 సంవత్సరమునకు నూతన కార్య వర్గాన్ని అభినందిస్తూ పేదలకు మంచి సేవలు అందించాలని నూతన వర్గాన్ని కోరడం జరిగింది. అనంతరం మురళి నాయుడు మాట్లాడుతూ కొత్త సభ్యులనే చేర్పించిన వారికి లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా గుర్తించి వారికి జ్ఞాపకాలను అందించడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *