

గూడూరు. మన న్యూస్ :- పట్టణంలో ఆటోనగర్ ఏర్పడినప్పటి నుంచి దాన్ని అభివృద్ధి కొరకు పట్టుదలతో కృషి చేయడం జరిగిందని, నేడు ఆటోనగర్ అభివృద్ధి కి బాటలు వేయడం సంతోషకరమని, ఆటోనగర్ యూనియన్ సభ్యులు ఎస్కే చాంద్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక డివిజనల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సంబంధిత డిప్యూటీ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు నుండి గూడూరు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆటోనగర్ యూనియన్ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఆటోనగర్ ఏర్పడినప్పటి నుంచి యూనియన్ సభ్యులతో కలిసి ఆటోనగర్ అభివృద్ధికి సహకరించాలని సంబంధిత అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి వినతులు సమర్పించడం జరిగిందని, ఆటోనగర్ 2020 ప్రారంభమైందని, అప్పటి నుండి 120 ప్లాట్లు అలాట్మెంట్ అయ్యాయని, అందులో భాగంగా నేడు ఐదు ప్లాట్ లకు రిజిస్ట్రేషన్లు జరిగాయని, మిగిలిన వాటికి కూడా రిజిస్ట్రేషన్లు త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని ఆశ భావం వ్యక్తం చేశారు. ఆటోనగర్ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకళ్లడం జరిగిందని, ఉన్నత స్థాయి అధికారులతో పాటు, స్థానిక అధికారులతో కూడా ఆటోనగర్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పలు దఫాలుగా చర్చించడం జరిగిందని, ఆటోనగర్ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కు ఆటోనగర్ యూనియన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, అలాగే రిజిస్ట్రేషన్ కు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్చి పల సుబ్రహ్మణ్యం, ఆటో నగర్ యూనియన్ సభ్యు పాల్గొన్నారు.