గూడూరు,మన న్యూస్ :- నెల్లూరు నుండి డిప్యూటీ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి గూడూరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి మొట్టమొదటిసారిగా వచ్చి ఆటోనగర్ ప్లాట్స్ ఐదుగురు సభ్యులకి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మేనేజింగ్ డైరెక్టర్ మంగళగిరి అధికారితో మాట్లాడి మనకు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చొరవ తీసుకున్నందుకు మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇందులో భాగంగా రోడ్లు, కరెంట్, అన్ని వసతులు త్వరలో మొదలు పెడతామని చెప్పారు ఆటోనగర్ కి శుభ ఘడియలు వచ్చాయి అని సభ్యులందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జోనల్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి, ప్రెసిడెంట్ చాంద్ బాషా, ప్రధాన కార్యదర్శి మర్రిపల్లి సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *