గూడూరు, మన న్యూస్:- తిరుపతి జిల్లా గూడూరు సంయుక్త నగర్ లో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిరం స్కూలును శుక్రవారం అమెరికాలో నివాసముంటున్న సన్నారెడ్డి నివ్య, సన్నారెడ్డి నిరీష, సన్నారెడ్డి నిష్యా సందర్శించారు. వారు విద్యార్థులతో కాసేపు గడిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిశు మందిరం విద్యార్థులు ఎంతో ప్రతిభను చూపిస్తున్నారని, చిన్న వయసులోనే పిల్లలు సంస్కృత శ్లోకాలు చెప్పడం, దేశభక్తి గీతాలు పాడటం అభినందనీయమన్నారు. వారు మాట్లాడుతూ మీరందరూ ఇప్పటినుంచే నిర్దిష్ట ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఇష్టపడి చదివి భవిష్యత్తులో మీరందరూ ఉన్నత స్థాయికి రావాలని అదేవిధంగా సమాజంలో మీ తల్లి తండ్రులకు గౌరవం లభించాలంటే మీరందరూ ఇప్పటినుంచే బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చినప్పుడే మీ తల్లి తండ్రులకు గౌరవం లభిస్తాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు మల్లెమాల మురళి రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్యామసుందరరావు (మయూరి శ్యామ్ యాదవ్), వెంకట రమణయ్య, సనత్ రెడ్డి, వంగా ప్రసాద్ రెడ్డి, ప్రవీణ్ కృష్ణారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగనాయకులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *