గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 20 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల కేంద్రంలోని భూ భారతి చట్టం -2025 రెవెన్యూ సదస్సు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ సిరాజ్ పాల్గొనడం జరిగినది. మండల అధికారులు మరియు మండల నాయకుల సమన్వయంతో ప్రజలకు అవగాహన చేస్తూ దరఖాస్తుల స్వీకరించడం జరిగింది. మహమ్మద్ సిరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క రైతు కి న్యాయం జరుగుతుందని రైతులకు మరియు ప్రజలకు తెలిపారు. అదేవిధంగా రైతులకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అని అన్నారు. ఈ భూ భారతి చట్టం ఒక చుట్టం లాగా ఉంటుంది అని అన్నారు.
ధరణి అక్రమాల వలన కెసిఆర్ ప్రభుత్వం కూలిపోయిందని తెలిపారు. ధరణి చట్టం వలన కెసిఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, ఎంతోమంది రైతులు ఇబ్బంది పడ్డారని తెలిపారు.
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా అనేకమంది పేద రైతులు ఇబ్బందులకు గురయ్యారని వేల ఎకరాల భూములు గల్లంతయ్యాయని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పరమేష్ నాయుడు, భరత్ రెడ్డి , జె.మల్లేష్ , జె.శేఖర్ , జె.శ్రీను కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *