యోగాతోనే మనశ్శాంతి పూర్తి ఆరోగ్యం సాధ్యం తాసిల్దార్ అరుణకుమారి!

పాలసముద్రం మండలం న్యూస్ : ప్రభుత్వం రాష్ట్రాన్ని యోగాంధ్ర ప్రదేశ్ గా మార్చడంలో భాగంగా ప్రతి ఒక్కరూ యోగాను ప్రతిరోజు చేస్తే పూర్తి ఆరోగ్యవంతంగా ఉండటంతో పాటు మనశ్శాంతి చదువులపై పూర్తి దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుందని తాసిల్దార్ అరుణకుమారి ఆశాభవాన్ని వ్యక్తం చేశారు.ఈ మేరకు జిల్లా రెవిన్యూ అధికారి వారి ఆదేశానుసారము మండలంలోని తిరుమలరాజుపురం సచివాలయ పరిధిలోని ఐదు కేంద్రాల్లో మహిళలు పురుషులు మరియు విద్యార్థులతో తాసిల్దార్ యోగ చేయించడంతోపాటు ఆమె కూడా స్వయంగా యోగ ట్రైనింగ్ లో పాల్గొన్నది.ఈ సందర్భంగా ఆమె యోగా పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు గూర్చి అందరికీ వివరించారు.ముఖ్యంగా విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలంటే ప్రతిరోజు యోగ అరగంటపాటైన చేస్తే విద్యాభివృద్ధి చక్కగా జరుగుతుందని తెలియజేశారు.అలాగే ఉద్యోగస్తులు రైతులు శ్రామికులు గృహంలో ఉండే మహిళలు అందరూ యోగాన్ని పాటించి పని ఒత్తిడి తగ్గించుకోవడంతోపాటు కండరాలు మెదడు చురుగ్గా పనిచేస్తాయని వివరించారు.ప్రపంచ యోగ దినం సందర్భంగా జూన్ 21వ తేదీన విజయవాడ లో యోగ డేని నిర్వహిస్తారని మన మండలంలో కూడా ప్రతి ఒక్కరూ జూన్ 21వ తేదీన యోగాను ఇలాగే అధిక సంఖ్యలో పాల్గొని యోగ కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ తో పాటు ఎమ్మారై ఎన్. దేవి విఆర్ఓ వెంకటాచలం, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ప్రజా ప్రతినిధులు మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..