లోకేష్ పై ఫేక్ ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు

మన న్యూస్ సాలూరు జూన్ 14 := పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు, 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో తల్లికి వందనం డబ్బులు పడ్డాయని మంత్రి సంధ్యారాణి తెలియజేశారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేసి పుస్తకాలు, బూట్లు, బ్యాగులను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకంలో నాణ్యమైన కిట్లను అందజేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 42 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి ఇచ్చారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 67 లక్షల మంది విద్యార్థుల కు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యావని అన్నారు. 82 లక్షల మంది విద్యార్థులు ఉంటే 67 లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వడం ఏంటని వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేస్తుందని అన్నారు. 82 లక్షల మంది విద్యార్థుల్లో అంగన్వాడి ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉంటారని తెలుసుకోకుండా వైసీపీ నాయకులు విమర్శలు చేయడం తగదని పత్రికా ముఖంగా హెచ్చరించారు. 2 వేలు నుండి 3 వేలు పించను ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టిందన్నారు. అదే కూటమి ప్రభుత్వం 3 వేలు నుండి ఒకేసారి 4 వేలు పెంచి గత మూడు నెలల పింఛను కూడా ఒకేసారి అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం మాదిరిగా దిష్టిబొమ్మ ఫోటోలు ఉండవన్నారు. వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం రాజముద్ర ఉంటుందన్నారు. వైసిపి పాలనలో రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోయినప్పటికీ ప్రధానమంత్రి మోడీ, పవన్ అండదండలతో చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బంజ్దేవ్, ఏఎంసి చైర్మన్ ముఖి సూర్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్, మక్కువ అధ్యక్షుడు గొల్ల వేణు, మెంటాడ అధ్యక్షుడు వెంకటరమణ, కౌన్సిలర్ హర్షవర్ధన్, పప్పల మోహన్ రావు ,యుగంధర్ ,బృందావనం అశోక్ ,విక్రమ శ్రీను, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..