గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 13 :- జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ లోనీ IDOC మీటింగ్ హాల్ లో వ్యవసాయ రైతులతో రైతు సంక్షేమ శాఖ సమీక్ష.. జిల్లా కలెక్టర్ మరియు తెలంగాణ వ్యవసాయ&రైతు సంక్షేమ శాఖ కమిషన్ చైర్మెన్ కోదండ రెడ్డి,మరియు కమిటీ సభ్యుల సమావేశం. శుక్రవారం ఉదయం 9:30 గంటలకు పుటన్‌పల్లి గ్రామంలో సాగు పత్తి విత్తనాల పంటలపై ఉత్పత్తి సంబంధిత క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించి,రైతుల నుంచి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్న చైర్మెన్ గారు.మరియు జిల్లా కలెక్టర్ మరియు వ్యవసాయ అధికారులు. తదనంతరం ఉదయం 11:30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విత్తన పత్తి పంటకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి,వాటికి పరిష్కారానికి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఐసిసి కార్యదర్శి,అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ .పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలన రైతుల కోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కార దిశగా రైతు కమిషన్ చైర్మెన్ మరియు సభ్యులని పంపి నేరుగా వ్యవసాయ రైతులతో మాట్లాడం తో రైతులకు న్యాయం చేకూరుతుంది అనే నమ్మకం ఉంది అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *