నాయి బ్రాహ్మణుల సమస్యలపై మంత్రులకు వినతి…

మన న్యూస్,తిరుపతి,:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఆధ్వర్యంలో కార్పొరేషన్ డైరెక్టర్లు పలువురు శుక్రవారం రాష్ట్ర మంత్రులను కలిసి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కలిసి రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని అమలు చేయడం గురించి మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దీనిపై మంత్రికి వినతిపత్రం అందజేయగా సానుకూలంగా స్పందించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలకు కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు . అలాగే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని కలిసి నాయి బ్రాహ్మణ అరాధ్య దైవం ధన్వంతరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ను కలిసి నాయి బ్రాహ్మణులపై కుల దూషణలు పెరుగుతున్నాయని వివరించారు. కులం పేరుతో దూషిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలను కఠినంగా తీసుకునేలా చూడాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా నాయి బ్రాహ్మణులకు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉందని చెప్పారు. నియోజకవర్గాల వారీగా నాయి బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలని కోరుతూ గతంలో ఇచ్చిన జీవోలు 13, 14 అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వీటిపై మంత్రులు సానుకూలంగా స్పందించడం పట్ల నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్లు సురవరపు నాగరాజు, మద్దిరాల గంగాధర్ మున్నంగి శివ శేష గిరిరావు, లంక రత్న రావు , జి.సత్యనారాయణ , నిడమానూరు రమేష్ పుల్లేటికుర్తి రమేష్ , నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..