ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,బుచ్చిరెడ్డిపాలెం:- పెనుబల్లిలో వైభవంగా పల్లె పండుగ కార్యక్రమం- ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాల ప్రారంభం- పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి పంచాయతీలో 10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సి.సి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి చేరుకున్న ప్రశాంతిరెడ్డి కి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పెనుబల్లిలో సీసీ రోడ్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్లెల అభివృద్ధి కోసమే ‘పల్లె పండుగకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. బుచ్చిరెడ్డి పాళెం మండలంలో ఈ ఏడాది కాలంలో దాదాపు 4 కోట్ల 70 లక్షలతో గ్రామాలలో రోడ్లు, డ్రైన్లు, ప్రజలకు తాగునీటి అవసరాల కోసం వెచ్చించామన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సహాయ సహకారాలతో కేంద్ర ప్రభుత్వం సాయంతో బుచ్చి-ఊటుకూరు రోడ్డుకు 49 కోట్ల నిధులు తెచ్చామని చెప్పారు. కనిగిరి రిజర్వాయర్‌ను ఆధునీకరించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించామన్నారు. పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపేందుకు బుచ్చి టౌన్‌ బయటి నుంచి ప్రత్యేక బైపాస్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. దాదాపు 2 కోట్ల 90 లక్షలతో పంచేడు వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ పనులు జరుగుతున్నాయని, బుచ్చిరెడ్డిపాళెం పట్టణ మెకానిక్ సోదరుల కోసం నాగమాంబపురం వద్ద ఆటో నగర్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు, అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. డీఎస్సీ పోస్టుల దగ్గరి నుంచి గ్రామాల రూపురేఖలు మార్చేలా పాలన సాగిస్తున్నారన్నారు. గుంతలు పూడ్చే కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 1200 కోట్లు ఖర్చు చేశారన్నారు. 203 అన్నా క్యాంటీన్లు రీ ఓపెన్‌ చేశారన్నారు. చెత్త పన్నును రద్దు చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55,57,525 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాన్నారు. 990 కోట్లతో పంచాయతీల్లో అభివృద్ధి పనులకు కేటాయింపులు చేశారన్నారు. 4500 కోట్లతో గ్రామాల్లో 30 వేల పనులు చేపట్టారని వివరించారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి పెద్దపీట వేసిన ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో.. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మోర్ల సుప్రజ, బుచ్చి రూరల్‌ పార్టీ అధ్యక్షులు బెజవాడ జగదీష్‌, పట్టణ అధ్యక్షులు గుత్తా శీనయ్య, కోడూరు కమలాకర్‌రెడ్డి, ఎంపీ శేషయ్య, మహేంద్ర, గోపీ, సురేష్‌, సర్పంచి ఓడ పెంచలయ్య, ఎంపీటీసీ వినయ్‌ నారాయణ, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..