గడ్డిఅన్నారం. మన న్యూస్ :- శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయంలో 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతున్న తృతీయ శతాబ్దీ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు, స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి హోమం, లక్షకుంకుమార్చన, 108 కలశాలతో మహా అభిషేకం, ప్రముఖ పండితుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సత్యనారాయణ స్వామి ఆశీస్సులు గడ్డిఅన్నారం ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల ఐక్యతకు, ధార్మిక చైతన్యానికి మూలస్తంభాలవలె ఉంటాయి. దేవాలయ అభివృద్ధికి నా పూర్తిస్థాయి సహకారం ఎప్పుడూ ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవాలయ ఛైర్మన్ దేవరం లింగారెడ్డి, పూర్వ అధ్యక్షులు వూర నరసింహా గుప్త,భక్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *