కాళికాదేవి, విజయ వినాయక స్వామి దేవస్థాన మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గోన్న ఎమ్మెల్యేలు మురళీమోహన్, ‌అమరనాధ్ రెడ్డి..

మన న్యూస్ తవణంపల్లె జూన్-6

పూతలపట్టు నియోజకవర్గం,
తవణంపల్లె మండలం, సరకల్లు గ్రామంలో నూతనంగా నిర్మించిన కాళికాదేవి మరియు విజయ వినాయక స్వామి వారి దేవస్థానం మహా కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు పలమనేరు శాసనసభ్యులు యన్. అమరనాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తవణంపల్లె మండల నాయకులు, సరకల్లు పంచాయతీ సర్పంచ్ కత్తి సతీష్, స్థానిక గ్రామస్తులు ఎమ్మెల్యేల‌కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కాళిమాత అమ్మవారిని, విజయ గణపతి స్వామి వారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కుంభాభిషేకం కార్యక్రమం అనంతరం ఆలయ వేద పండితులు ఎమ్మెల్యేలకు వేదాశీర్వచనాలు అందించి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ… సరకల్లు గ్రామంలో కాళిమాత ఆలయం, విజయ వినాయక స్వామి వారి దేవస్ధానాల మహా కుంభాభిషేకం మహోత్సవంలో పాల్గోనడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ అభివృద్ధికి ప్రేరణ కలిగిస్తుందన్నారు. సర్పంచ్ కత్తి సతీష్ రెడ్డి ఆలయాన్ని అభివృద్ధి చేసిన తీరు ప్రశంసనీయమైనది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిఎన్టియూసీ కార్యదర్శి యవరాజుల నాయుడు, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, తవణంపల్లె మండలం టిడిపి అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్ నాయుడు, పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి.ధరణీ నాయుడు, బంగారుపాళ్యం మార్కెట్ కమిటీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు, క్లస్టర్ ఇంఛార్జ్ సునీల్ చౌదరి, కాణిపాకం మాజీ ఆలయ ఛైర్మెన్ మణినాయుడు, ఐరాల జెడ్పీటీసీ సుచిత్ర కన్నయ్య నాయుడు, మాజీ జెడ్పీటీసీ లతా బాబునాయుడు, మాజీ పూతలపట్టు ‌మండల అధ్యక్షులు చంద్రమౌళి, టిడిపి సీనియర్ నాయకులు రఘురాం చౌదరి, ప్రవీణ్ కుమార్ నాయుడు, కత్తి సుధాకర్ రెడ్డి, తవణంపల్లె మండల మహిళ అధ్యక్షులు చిట్టెమ్మ, యాదమరి మండల క్లస్టర్ ఇంఛార్జ్ చిత్రా నాయుడు,
సరకల్లు సర్పంచ్ కత్తి సతీష్ రెడ్డి మరియు మండల నాయకులు, కార్యకర్తలు, స్ధానిక ప్రజలు పాల్గోన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..