తొట్టంబేడు, మన న్యూస్ :- మండలంలోని కొణతనేరి పంచాయతీ గురప్పనాయుడు కండ్రిగ దళిత వాడకు చెందిన రవిచంద్ర కుమార్తె మృతి బాధాకరమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాలి మురళీ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రవిచంద్ర కుమార్తె పుట్టుకతో వికలాంగురాలుగా ఉండడంతో మధ్యలో ఫిట్స్ వ్యాధి సోకడంతో గత కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న గాలి మురళి నాయుడు,మాజీ మండల పార్టీ అధ్యక్షులు గోగినేని భాస్కర్ నాయుడు గారు భౌతికాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి , రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు లు చరవాణి ద్వారా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ మనోధైర్యంతో ముందుకు సాగాలని కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. కార్యక్రమంలో,సీనియర్ నాయకులు కుప్పయ్య,కిలారి వివేక్ చౌదరి
బాబు, జనార్ధన , సుబ్రహ్మణ్యం తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *