మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా ప్రత్తిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం నగర పంచాయితీకి చెందిన బదిరెడ్డి సతీష్ (గోవింద్ బాబు) నియమితులయ్యారు.ఈ మేరకు పార్టీ అధిష్టానం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు గత వైసీపీ ప్రభుత్వంలో ఏలేశ్వరం మండల ఇంచార్జిగా పనిచేశారు.ప్రస్తుతం ఆయన ఏలేశ్వరం నగర పంచాయితీ 3వ వార్డు కౌన్సిలర్ గా,ఆయన మాతృమూర్తి బదిరెడ్డి వెంకటరమణమ్మ 17వ వార్డు కౌన్సిలర్ గా పనిచేస్తూ ప్రజా సమస్యలపై గళమెత్తుతూ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు.ఆయన మాట్లాడుతూ అధినేత జగన్ తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి పూర్తి న్యాయం చేస్తానన్నారు.నాకు ఈ అవకాశం కల్పించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజాకి,పిఎసి సభ్యుడు ముద్రగడ పద్మనాభంకి,నియోజకవర్గ ఇంచార్జి ముద్రగడ గిరిబాబుకి కృతజ్ఞతలు తెలియచేస్తునన్నారు.
తమ అభిమాన నాయకుడు బదిరెడ్డికి పార్టీ పదవి లభించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *