మన న్యూస్,నిజాంసాగర్ ( జుక్కల్ ) : నిజాంసాగర్ మండలంలోని చిన్న ఆరెపల్లి గ్రామంలో నల్ల పోచమ్మ
ఉత్సవాలను పురస్కరించుకొని వసంతరావు పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు ఏర్పాటు చేయగా,ఈ కుస్తీ పోటీలను తిలకించేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.చిన్నారుల నుంచి మొదలైన కుస్తీ పోటీలలో మల్ల యోధులు ఆసక్తి చూపించారు.కుస్తీ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి వసంతరావు పటేల్ నగదు అందజేశారు.
చిట్ట చివరి కుస్తీ పోటీల్లో విజేతలు గా నిలిచిన వారికి 3000 రూపాయలను నగదును అందజేశారు

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *