కాకినాడ, మే 24 మన న్యూస్ :– కాకినాడలోని సూర్య కళామందిరంలో రాణి అహల్యాబాయి 300వ జయంతి వేడుకలు కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వర రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్య వక్తగా మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రసంగం చేశారు. రాణి అహల్య బాయి హోల్కర్ మరాఠాలు పరిపాలించిన మాల్వా సామ్రాజ్యం ఆమె 1725 మే 24న జన్మించారన్నారు. హిందూమతం కార్యక్రమాలు నిర్వహించి పేరు గాంచారన్నారు. . రాణి అహల్య బాయి ఇండోర్, మహేశ్వర్ ప్రాంతాల్లో అనే హిందూ దేవాలయాలు నిర్మించారని అలాగే అనేక పవిత్ర స్థలాల్లో ధర్మశాలలు నిర్మించారన్నారు. ద్వారక మొదలుకొని వారణాసి ఉజ్జయిని, నాసిక్, గయ, వైద్యనాథ్ ఆలయం వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు నిర్మాణం చేశారన్నారు. ఇంకా ఆమె చేసిన అనేక కార్యక్రమాలను మాధవ్ వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వేటికూరి సూర్యనారాయణ రాజు, పెద్దిరెడ్డి రవికిరణ్, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, దాట్ల సూర్యనారాయణ రాజు, గండి కొండలరావు, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, జ్యోతుల రాజేష్, కొక్కిలిగడ్డ గంగరాజు, తుమ్మల పద్మజ, గూటూరు పద్మ, పైడా వెంకటనారాయణ, పైడా కృష్ణమోహన్, యార్లగడ్డ రామ్ కుమార్, గౌతు చిన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *