

వెదురుకుప్పం, మన న్యూస్, మే 17:వెదురుకుప్పం మండలంలోని చవటగుంట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పుల్లూరు రఘునాథరెడ్డి కుమారుడు సాయి చందు, అదే మండలానికి చెందిన వెదురుకుప్పం గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి కుమార్తె ధరణి వివాహ వేడుక శుక్రవారం అత్యంత ఘనంగా జరిగింది.ఈ శుభవేళలో వివిధ పార్టీల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.వివాహ వేడుకలో ముఖ్యంగాటిడిపి క్లస్టర్ ఇంచార్జి మోహన్ మురళిసోక్రటీస్ కరస్పాండెంట్ గుణశేఖర్నీటి సంఘం అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, టిడిపి మండల కార్యదర్శి అక్కిం మధు,నాయకులు బండి నాగిరెడ్డి,పేరుమళ్ళుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, పల్లాలూ బూత్ కమిటీ కన్వీనర్ కోటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వధూవరులను శుభాకాంక్షలతో వరించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విందు-భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. గ్రామస్తులూ, బంధువులూ, స్నేహితులూ పెద్ద ఎత్తున పాల్గొని వేడుకను మరింత వైభవవంతంగా మార్చారు..