

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్): కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పై ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేటి వరకు మేనిఫెస్టోలో ఇచ్చిన అనేక హామీలను అమలు చేస్తూనే, రాష్ట్రములో అభివృద్ధి కూడా పరుగులు తీసేలా చేస్తుందని, రాష్ట్రం ఆర్థికంగా కష్టాలలో ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం శాయశక్తుల పనిచేస్తుందని అన్నారు.ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకోవడం జరిగిందని, మా నియోజకవర్గంలో అర్హులైన మహిళలందరూ ఇకపై ఉచిత బస్సు ప్రయాణమును వినియోగించుకోబోతున్నారు అనే విషయం సంతోషం కలుగుతుందని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 వ తారీకు నుండి అమలు చేస్తున్నామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ నియోజకవర్గ మహిళ తరఫున ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కృతజ్ఞతలు తెలిపారు.ప్రభుత్వం ప్రకటించిన ఈ ఉచిత బస్సు ప్రయాణం నియోజకవర్గంలో ప్రతి మహిళ సద్వినియోగంచేసుకోవాలని కోరారు.