48 సర్వేనెంబర్ లో గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములు కి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి

మన న్యూస్ సాలూరు మే 17:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కుడుమూరు భూ పోరాట కమిటీ కన్వీనర్ అప్పలస్వామిఆధ్వర్యంలో కుడుమూరు మెట్టవలస వద్ద జరిగిన సభ లో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాల ప్రభుత్వ భూమి తాతల కాలం నుండి సాగు చేస్తున్న గిరిజనులకు నేటి కూడా పట్టాలు పంపిణీ చేయకపోవడం దుర్మార్గమని దీనికి వెంటనే అధికారులు స్పందించి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్ద కాలంగా అనేక పోరాటాలు చేసిన నేటికీ కూడా సర్వేలు జరిపి కూడా పట్టాలు పంపిణీ చేయకపోవడం వలన ఈ భూములను కాజేయడానికి కొంత మంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని, దీని ప్రజలంతా గమనిస్తున్నారని గిరిజనుల అంతా ఐక్యంగా ఉండి తమ భూములకు డి పట్టాలు మంజూరు చేసే వరకు పోరాటాలకు ముందుకు రావాలని తెలిపారు.సిపిఎం పార్టీ గిరిజనులకు ఎప్పుడు అండగా ఉంటుందని పేదలకు అండగా ఉంటుందని అన్నారు. దీనికి నిరసనగా ఈనెల 23 నుండి 25 వరకు మూడు రోజులు పాటు పాదయాత్రలు జరుపుతున్నట్లు తెలిపారు. వెంటనే పట్టాల మంజూరు చేయకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యలు ఎన్ వై నాయుడు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లయిన నేటికీ కూడా గిరిజనులకు మౌలిక సదుపాయాలు కరువయ్యాయని పట్టాల కోసం ఇప్పటివరకు దరఖాస్తులు పెట్టుకున్న పట్టించుకోకపోవడం వలన పేదలు భూములు ముఖ్యంగా గిరిజనుల భూములు అన్యాక్రాంతమవుతున్నాయని కుడుమూరు 48 సర్వే నెంబరు లో సాగు చేస్తున్నటువంటి గిరిజనులందరికి కూడా పట్టాలు పంపిణీ చేయకపోతే భవిష్యత్తులో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కుడుమూరు భూ పోరాట కమిటీ కన్వీనర్ అప్పలస్వామి మాట్లాడుతూ ఈ భూములను అనేకమంది పెద్దలు గద్దల్ల వాలి తన్నుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నారని గిరిజనులను ఐక్యంగా ఉన్న వారిని విడదీసి ఇబ్బందులు గురి చేస్తున్నారని తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వెంటనే పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు అధికారులు వెంటనే స్పందించకపోతే ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపడతామని వెంటనే పట్టాలు మంజూరు చేయాలని గత ప్రభుత్వ హయాంలో సర్వేలు చేసినటువంటి వివరాలు నేటి కూడా బహిర్గతం చేయకపోవడం సరైనది కాదని ప్రస్తుత మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి కూడా దీనికి సమాధానం చెప్పాలని ప్రతిపక్ష ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి నేడు హామీ నిలబెట్టుకుని గిరిజనులకు భూములు పంపిణీ విషయంలో కృషి చేయాలని అన్నారు. కోడుమూరు భూ పోరాట కమిటీ సభ్యులు సుర్రు గంగయ్య,మాదల జమ్మరాజు, రామయ్య, గమ్మెల గోపాలు, కొర్ర కళ్యాణ్,కొర్ర శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు, కుడుమూరు సమస్యల పరిష్కారం కై ఈనెల 23 నుండి 25 వరకు మూడు రోజులపాటు జరిగే పాదయాత్రలను జయప్రదం చేయాలని భవిష్యత్ పోరాటానికి గిరిజల్లంత ఐక్యంగా కదిలి సమస్త పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు