

Mana News :- వెదురుకుప్పం మండలంలోని టి.కె.యం. పురం గ్రామంలో జరగిన గంగమ్మ జాతర మహోత్సవంలో తెలుగు దేశం పార్టీ నాయకులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్, వాణిజ్య విభాగ నియోజకవర్గ అధ్యక్షులు బట్టే చాణిక్య ప్రతాప్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు అయ్యప్ప, బూత్ కన్వీనర్ మోహన్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు మోహన్ యాదవ్, కార్యదర్శి భాస్కర్, యువ నాయకుడు బాబి లు కూడా ఈ ఉత్సవంలో పాల్గొని గ్రామస్తులతో కలిసి భక్తి భావంతో పాల్గొన్నారు. జాతర సందర్భంగా గ్రామంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది.