

మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా మహిళల బీచ్ కబడ్డీ జట్టుకు ఐదుగురు పాకల క్రీడాకారిణులు ఎంపికైనట్లు కోచ్ పిల్లి హజరత్తయ్య తెలిపారు.1)వి.అర్చన 2)కె.భూమిక3) కె.సౌమ్య 4) కె. సి పోరా 5)కె. త్రిగుణ ఎంపికైనట్లు తెలిపారు.వీరు12 వ ఆంధ్ర రాష్ట్ర అంతర జిల్లాల బీచ్ కబడ్డీ టోర్నమెంట్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మే 2 నుండి మే 5 వరకు జరిగే పోటీలలో పాల్గోనున్నారు.ఈ సందర్భంగా క్రీడాకారిణులు ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కుర్రా. భాస్కర రావు కి కార్యదర్శి వై. పూర్ణచంద్రరావు కి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు క్రీడాకారిణులకు అభినందనలు తెలిపారు.