

ఎస్ఆర్ పురం,మన న్యూస్.. కత్తులతో యుద్ధం చేసే కాలం పోవాలి కలంతో యుద్ధం చేసే కాలం రావాలి అని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరుమల అన్నారు శనివారం ఎస్ఆర్ పురం మండలం లో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అలాగే ఎస్ఆర్ పురం అటవీ ప్రాంతంలో వల్లెమ్మ అనే మహిళకు కుమార్తె కలదు ఆమె నలుగురు పిల్లలను వల్లెమ్మ దగ్గర వదిలి ఎక్కడికో వెళ్లిపోయింది ఆ నలుగురు పిల్లలు వల్లెమ్మ అవ్వ దగ్గర పెరుగుతున్నారు వారికి కూడు గుడ్డ లేక నిరుపేదరికంలో అడవిలో జీవిస్తున్నారు ఒక పూట తిని రెండు పుట్ల వస్తు ఉండే పరిస్థితి అలాంటి పేదరిక కుటుంబాన్ని కి ఏపీయూడబ్ల్యూజే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ మీడియా ఆధ్వర్యంలో 20 కేజీల బియ్యం బస్తా 20 రకాల ఇంటి సరుకులను వారికి అందించడం జరిగింది… ప్రతి ఒక్కరూ సమాజంలో సేవ దృక్పథంతో మెలగాలని అప్పుడే సమాజ శ్రేయస్కులవుతామని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరుమల తెలిపారు అనంతరం ఆ పేదరికంలో ఉన్న వల్లెమ్మకు కార్వేటినగరం మండలం సాక్షి రిపోర్టర్ రాజా కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జయప్రకాష్ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేష్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు ఎంజీఆర్ సంయుక్త కార్యదర్శి రాజయ్య ట్రెజరర్ నరేష్ ఈసీ మెంబర్ సతీష్ మునికృష్ణ పాల్గొన్నారు.

- గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ వేడుకలు
- కళం మరియు గళం తో అనునిత్యం ప్రజా చైతన్యానికి మీడియా కృషి చేయాలి