

మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ, బాలిరెడ్డి నగర్ కు చెందిన ఫిర్యాది చిలకూరి హరికృష్ణ s/o రమణయ్య, 29 Yrs, కులం: యానది యొక్క కుమార్తె ఐశ్వర్య , 3 సం,లు సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో తప్పిపోయినట్లు తేదీ:01.05.2025 న ఇచ్చిన పిర్యాది మేరకు సింగరాయకొండ P.S కేసు నమోదు చేసినారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాస రావు గారి ఆధ్వర్యంలో సింగరాయకొండ సీఐ Ch. హాజరత్తయ్య, ఎస్సై బి.మహేంద్ర మరియు వారి సిబ్బందితో మూడు ప్రత్యేక బృందాలు గా ఏర్పడి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తూ మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిర్మించిన సీసీ కెమెరాలు ద్వారా పాపను ఏ మార్గం వైపు తీసుకుని వెళ్లారో వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి, పాప యొక్క ఫోటోను అన్ని వాట్స్అప్ గ్రూపుల్లోనూ, అన్ని విలేజ్ వాట్సప్ గ్రూపుల్లోనూ, షేర్ చేయడంతో మరియు పాంప్లెట్లును పంచటం మరియు అన్ని కోణాలలో దర్యాప్తు చేసి నెల్లూరు జిల్లా, వలేటివారిపాలెం మండలంలో పాపను గుర్తించి శనివారం జిల్లా ఎస్పీ గారి కార్యాలయంలో ఎస్పీ గారు తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. పిల్లల భద్రత పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
మా పాపను క్షేమంగా తిరిగి అప్పగించిన పోలీసులకు మేము జీవితాంతం రుణపడి ఉంటామని, క్షణం క్షణం యుగంగా గడిచిందని, మా పాప క్షేమంగా ఉందో లేదో అని ప్రతి క్షణం భయంతో వణికిపోయామని, పోలీసులు చూపిన చొరవ, చేసిన ప్రయత్నాలు వెలకట్టలేనివని, వారికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. పాపను తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేర్చినందుకు జిల్లా ఎస్పీ గారి మరియు సింగరాయకొండ పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
పాపను గుర్తిoచుటలో అత్యంతప్రతిభ కనపరిచిన సింగరాయకొండ CI, Ch, హాజరత్తయ్య, సింగరాయకొండ ఎస్సైB. మహేంద్ర మరియు వారి సిబ్బంది HC.865, G.రమేష్ , HC.1292, D.తిరుపతి స్వామి , PC.3533, Ch.చిన్న , PC.3681, S.సుమన్ , PC.3566 , ఖాజా , PC.1174 , చంద్ర శేఖర్ అను వారులను జిల్లా ఎస్పీగారు ప్రత్యేకంగా అభినందించినారు.