మన న్యూస్, కోవూరు, ఏప్రిల్ 29:- ఎమ్మెల్యే ప్రశాంతమ్మ చొరవతో 12 మందితో ఏర్పడిన కమిటీ.- మే 17 నుంచి 27 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు.బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయానికి నూతన సేవా కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సేవా కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా.. ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. శ్రీ కామాక్షితాయి అమ్మవారి సేవా కమిటీలో తిరువూరు అశోక్ రెడ్డి, కనపర్తి నాగేంద్ర, నక్కల శివకృష్ణ తిరువాయిపతి నందకుమార్, ముంగర సుధాకర్, శశి శేఖర్ శర్మ (అర్చక), పాలూరు చాముండేశ్వరి, కొల్లపూడి శారద, పెన్నత్తూరు సుమలత, గండ్రకోట రమాదేవి, జొన్నలగడ్డ వరలక్ష్మి, ఇమ్మడిశెట్టి సౌజన్య లక్ష్మి గార్లు ఎన్నికయ్యారు. వీరు మే 17 నుంచి 27 వరకు జరగనున్న అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా సేవా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు, దేవాదాయ శాఖ మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే ఈ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *