నెల్లూరులో కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో పండగలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

మన న్యూస్,నెల్లూరు, ఏప్రిల్ 19 : నగరవ్యాప్తంగా భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు ,తరలివచ్చిన విపిఆర్ అభిమానులు,విపిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వినోద్‌రెడ్డి. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని టిడిపి నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన.. వేమిరెడ్డిపై తన అభిమానాన్ని చాటుకున్నారు.
తొలిగా మూలాపేట అలంకార్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి అనంతరం అక్కడే అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వీఆర్సి సెంటర్లో మైనార్టీ నాయకులతో కలిసి స్థానికులకు అన్నదానం చేశారు. వి ఎస్ సి సెంటర్ అనంతరం నర్తకి సెంటర్ చేరుకున్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి, ఇతర నాయకులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్థానికులకు స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం బాలాజీ నగర్ పూలే బొమ్మ సమీపంలో భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వినోద్ రెడ్డి.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భారీ కేకు కట్‌ చేసి స్థానికులకు అందించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ……. జిల్లావ్యాప్తంగా పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. వేలాది మందికి అన్నదానం చేయడం సంతోషాన్ని ఇచ్చిందని. ఎంపీ వేమిరెడ్డి నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జిల్లాలో అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారని, నిస్వార్ధంగా సేవ చేసే నాయకుడు మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 160 వాటర్ ప్లాంట్లు, పేద విద్యార్థుల కోసం ఉచితంగా విపిఆర్ విద్య, క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు వంటి అనేక ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా ప్రజలకు అండగా నిలిచారన్నారు. జిల్లాలో దివ్యాంగులకు అండగా నిలిచేందుకు 40 వేల రూపాయలు విలువ చేసే ట్రై సైకిల్స్ అందిస్తూ వారికి భరోసా ఇచ్చారన్నారు. పోలీసు వ్యవస్థకు కూడా సొంత నిధులతో వెహికల్స్ అందించిన ఘనత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి దక్కిందన్నారు. మహోన్నతమైన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని, కులమతాలకు అతీతంగా సేవ చేసే ఏకైక వ్యక్తి మన ఎంపీ ని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకా నాథ్ మాట్లాడుతూ……దైవ సమానులు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని ఒక పండుగ వాతావరణం లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. విపిఆర్ అంటే సేవకు ప్రతిరూపం అన్నారు. దేశం మొత్తం వెతికినా కూడా ఇలాంటి గొప్ప వ్యక్తి ఉండరని కొనియాడారు. రాజకీయాల్లోకి రాకముందే సేవ కార్యక్రమాలు చేసిన ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరింత ఉధృతం చేశారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఈరోజు ఇన్ని వేలమంది ఆయన జన్మదిన వేడుకలను పండగలా చేసుకుంటున్నారని అన్నారు. ఆ దేవుని ఆశీస్సులు ఎంపీ వేమిరెడ్డి పై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ
కార్యక్రమంలో ఉడాలి సూర్యనారాయణ, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రావు, సిద్దు సుబ్బారెడ్డి, శిరీష రెడ్డి, సునంద, కుసుమ, ఝాన్సీ, శ్రీకాంత్, ఫజల్, జాఫర్ ముజ్జు, ముజాఫర్, అంచెల సారథి, భార్గవ్, కనకేశ్వరరావు, హేమంత్, తిరుమల, సాయి, కుక్కా ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 4 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 8 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//