

కడప జిల్లా : మన న్యూస్ : ఏప్రిల్ 19 : కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా యర్రగుడి అచ్యుతరాజు కు శుక్రవారం నియామక పత్రం అందజేసిన కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ND విజయ జ్యోతి .అనంతరం అచ్యుత రాజు మాట్లాడుతూ కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతములో భాగంగా ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ షర్మిల రెడ్డి గారు నాకు ఈ పదవి కేటాయించడం జరిగింది అని.గతం లొ బద్వేల్ టౌన్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గా 8 సంవత్సరాలు పనిచేయడం జరిగింది అని నేను కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నావంతు కృషి చేస్తాను అని. నాకు ఈ పదవి రావడానికి ప్రధాన కారణం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎన్ డి విజయ జ్యోతి మరియు మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రస్తుత ఏపీ మీడియా చైర్మెన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
