

మనం న్యూస్: వైయస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం కాశి నాయన మండలం భారీ ఈదురు గాలులు, అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు పరిశీలించారు ఇటుకులపాడు, సావి శెట్టిపల్లెలో పర్యటించిన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు అక్కడ కూలిన అరటి తోటలు పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం వీచిన గాలివానకు కాశి నాయన మండలంలోని అరటి తోటలు ధ్వంసమయ్యాయి. నిండు కాపుతో ఉన్న చెట్లన్ని నేల పాలు కావడంతో రైతుల వేదన అరణ్య రోదనగా మారింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడం మరింత బాధ కలిగేస్తుందని రైతులు వాపోయారు. గాలులు వర్షాలకు ఇటుకుల పాడు పలు గ్రామాల్లో రైతులు విలవిలలాడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు పర్యటించారు దెబ్బతిన్న తోటలను పరిశీలించారు వారి బాధలను ఆలకించారు అండగా ఉంటామని ధైర్యం నింపారు ప్రభుత్వం తరఫున పరిహారం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని రైతులలో భరోసా నింపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి, మండల కన్వీనర్ హనుమంతు రెడ్డి, జిల్లా సెక్రెటరీ యాక్టివేట్ కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి,సర్పంచ్ శేషయ్య, కృష్ణారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, నాగ సుబ్బారెడ్డి, నరసింహారెడ్డి,బాలయ్య, జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు సాయి, నారాయణ రెడ్డి, గ్రామస్తులు రైతులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు