

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,జుక్కల్, మండల కేంద్రంలోని రేషన్ షాపులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క నిరుపేదలకు అందే విధంగా చూడడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు అనీస్ పటేల్,నాయకులు సత్య గౌడ్, పసుల రాములు,లక్ష్మణ్ దాస్,రాము రాథోడ్, తదితరులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు.