భోజన ప్రియులకు తిరుపతిలో సుందరం టిఫిన్ హౌస్ ప్రారంభం…సహజ సిద్ధమైన రుచికరమైన వంటకాలు….

మన న్యూస్,తిరుపతి, మార్చి 12:– రుచికరమైన సాంప్రదాయకమైన రుచికరమైన వంటలకు ప్రామాణికంగా నిలచిన సుందరం టిఫిన్స్ ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి లో ప్రారంభించబడినది. దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు చెందిన రుచికరమైన ఆహారపు వంటలను అందించాలన్నదే సుందరం టిఫిన్ హౌస్ యొక్క లక్ష్యం. ఈ నేపథ్యంలో బుధవారం రామానుజ సర్కిల్ లో తిరుచానూరు రోడ్డులోని హెచ్.పీ పెట్రోల్ బంకు పక్కన ఆర్కిడ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో లాంఛనంగా ప్రారంభించారు. మొదట హార్కిడ్ హోటల్స్ గ్రూప్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి సుందరం టిఫిన్ హౌస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ 2004వ సంవత్సరంలో బెంగళూరు బనశంకరి లో క్యాటరింగ్ రంగంలో మొట్టమొదట అడుగుపెట్టి భోజన ప్రియులకు ఇంటిల్లిపాది రుచికరమైన నాణ్యమైన అల్పాహార వంటకాలను అందించి దక్షిణాది రాష్ట్రాల భోజన ప్రియుల మన్ననలను అందుకుంది. తమ అరుచుర్లను దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ ప్రాంతాల ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో సుందరం టిఫిన్ హౌస్ ను తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యొక్క పాక సాంప్రదాయాలకు అనుగుణంగా న్యాచురల్ గా హోమ్లీ ఫుడ్ ను ప్రజలకు అందించాలన్నదే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. తరతరాల జ్ఞానం సహజసిద్ధమైన పదార్థాలు, రుచికరమైన వంటకాలు ప్రేమతో తయారు చేయబడ్డాయన్నారు. తిరుపతిలో 3 స్టార్ హోటల్స్ లలో ప్రారంభం:– తిరుపతి నగరంలో ఆర్కిడ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ మూడు 3 స్టార్ హోటల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. దేశ నలుమూలల నుండి వచ్చే భక్తులకు అందుబాటులో సరసమైన ధరలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విశాలమైన గదులతో ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పుడు తిరుపతిలోని తమ గ్రూపుకు చెందిన మూడు స్టార్ హోటలలో సుందరం టిఫిన్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు. పాండిచ్చేరి, బెంగుళూరులలో సుందరం టిఫిన్ శాఖలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయని, ఎక్కువమంది ప్రజలు హోమ్లీ ఫుడ్ ను అనుభవించగలరని స గౌరవంగా తెలిపారు. ఇంటిలో అమ్మమ్మ, నాన్నమ్మ, నాని ప్రేమతో తయారు చేసిన హోమ్లీ ట్రెడిషనల్ వంటకాలు సుందరం టిఫిన్స్ హౌస్ లో అందుబాటులో ఉన్నాయన్నారు.
మైసూర్ కాఫీ తమ ప్రత్యేకత: సుందరం టిఫిన్ హౌస్ లో మైసూర్ కాఫీ రుచి మనసుకు ఎంతో ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చే విధంగా కాఫీ ప్రియులకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని సుందరం టిఫిన్ హౌస్ అవుట్ లెట్ లను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈనెల 15 వరకు 50% డిస్కౌంట్: సుందరం టిఫిన్ హౌస్ లో వంటకాలు భోజనం ప్రియులకు ప్రజలకు 50% రాయితీతో ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కావున న్యాచురల్ హోమ్లి వంటకాలను ఆస్వాదించాలనుకునే వారందరికీ ఒకసారి సుందరం టిఫిన్ హౌస్ సందర్శించి ఇక్కడ అందించే ప్రేమానురాగాలతో సంతోషాలతో తమ వంటకాలను రుచి చూడాలని వారు కోరారు. కావున తిరుపతి నగర ప్రజలతో పాటు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్కిడ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 6 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు