

Mana News :- జీడి నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం ఎస్సై రాజ్ కుమార్ తన సిబ్బందితో కలిసి స్థానిక పట్టణంలోని పలు దుకాణాలను శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాదారులకు ఇబ్బంది కలిగించే విధంగా దుకాణాల బోర్డులను రోడ్డుపై ఏర్పాటు చేసిన సుమారు100 దుకాణదారులకు టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద జరిమాన విధించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
