

Mana News :- 2024-2025 సంవత్సరానికి జిల్లా స్థాయిలో నిర్వహించే సైన్స్ ఇన్స్పైర్ అవార్డ్స్ కు జీడి నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండల విద్యార్థులు ఎస్. బ్రాహ్మణి, బి. సంజన, కే. పూజిత ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు గుణశేఖర్ గురువారం సాయంత్రం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయి విజేతలు తొందరలో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలలో పాల్గొంటారన్నారు. 2024 – 2025 సంవత్సరానికి జిల్లా స్థాయిలో నిర్వహించే సైన్స్ ఇన్స్పైర్ అవార్డ్స్ కి వెదురుకుప్పం మండలం సోక్రటీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ దేవలంపేట విద్యార్థులు ఎస్.బ్రాహ్మణి, బి.సంజన, కే.పూజిత ముగ్గురు విద్యార్థులు విద్యార్థులు ఎంపికైనట్లు కరస్పాండెంట్ గుణశేఖర్ తెలియజేశారు చిత్తూరు జిల్లా నుండి మొత్తం 311 మంది ఎంపిక కావడం జరిగింది వీరందరూ జిల్లాస్థాయిలో పాల్గొని అక్కడ ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది విద్యార్థులకు మంచి ప్రాజెక్టును ఎంపిక చేయడంలో కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించడం జరిగింది.
