ఉరవకొండ మన ధ్యాస: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో కర్నూలులో ఉద్యమం మళ్లీ వేడెక్కుతోంది.

కర్నూలు పాత బస్టాండ్ వద్ద ఉన్న ఒక హోటల్‌లో సోమవారం సాయంత్రం హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో సుమారు 50 మంది న్యాయవాదులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంగళవారం నుంచి చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణపై ప్రణాళికలు సిద్ధం చేశారు.

సమితి నాయకులు మాట్లాడుతూ, కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారని వెల్లడించారు. నిరసన కార్యక్రమాల షెడ్యూల్.1 మంగళవారం (16-9-2025): కర్నూలు జిల్లా ప్రధాన కోర్టు నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ.కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ.

    ర్యాలీ అనంతరం నినాదాలు, ప్రసంగాలు.

    1. తరువాతి దశలో:

    జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఇళ్ల ముట్టడులు.

    1. 18-9-2025 ఉదయం 11 గంటలకు:
    2. కర్నూలు ధర్నాచౌక్ వద్ద, శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం దగ్గర టెంట్ వేసి రిలే నిరాహార దీక్షలు ప్రారంభం. పాల్గొన్న న్యాయవాదులు. బండారి చంద్రుడు, జీ.వి.కృష్ణమూర్తి, బి. రామాంజనేయులు, భరత్ సింహారెడ్డి, ఎం.ఏ. తిరుపతయ్య, కే. నాగరాజు, ఖాదర్ భాష, మహేష్, వెంకటేష్, సంతోష్, శ్యాం సన్, బి. హేమంత్ రెడ్డి, రాఘవ్, మహేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైకోర్టు సాధన సమితి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాసంఘాలు ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేసింది.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *