ఉరవకొండ మన ధ్యాస: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో కర్నూలులో ఉద్యమం మళ్లీ వేడెక్కుతోంది.
కర్నూలు పాత బస్టాండ్ వద్ద ఉన్న ఒక హోటల్లో సోమవారం సాయంత్రం హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో సుమారు 50 మంది న్యాయవాదులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంగళవారం నుంచి చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణపై ప్రణాళికలు సిద్ధం చేశారు.
సమితి నాయకులు మాట్లాడుతూ, కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారని వెల్లడించారు. నిరసన కార్యక్రమాల షెడ్యూల్.1 మంగళవారం (16-9-2025): కర్నూలు జిల్లా ప్రధాన కోర్టు నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ.కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ.
ర్యాలీ అనంతరం నినాదాలు, ప్రసంగాలు.
జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఇళ్ల ముట్టడులు.