బాల వికాస్ కేంద్రాల ద్వారా విలువలతో కూడిన విద్య – ఊరిమిండి వెంగలరెడ్డి

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని అయ్యప్పస్వామి దేవస్థానంలో శనివారం జరిగిన జిల్లా (ఒంగోలు కేంద్రం) బాల వికాస్ కేంద్రాల మాతాజీలు, అర్చకస్వాముల సమావేశానికి సమరసత సేవా ఫౌండేషన్ సింహపురి జోన్ ధర్మప్రచారక్ ఊరిమిండి వెంగలరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవాలయాలను కేంద్రంగా చేసుకొని నడుస్తున్న బాల వికాస్ కేంద్రాల్లో చిన్నారులకు ఆటలు, పాటలు, కళలు, జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలతో కూడిన విద్య అందిస్తున్నామని చెప్పారు. ప్రతి రోజు సాయంత్రం రెండు గంటలపాటు ఈ కేంద్రాలను నడపాలని మాతాజీలకు సూచించారు.భారతదేశ ఔన్నత్యాన్ని ప్రతిబింబించే మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పూర్వీకుల చరిత్ర గురించి చిన్ననాటి నుంచే అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన పేర్కొన్నారు.అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రం పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో 25 దేవాలయాలు నిర్మించబడ్డాయని, అక్కడి వారికి అర్చక శిక్షణ ఇచ్చి, వారు ప్రస్తుతం అర్చక స్వాములుగా సేవలందిస్తున్నారని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా ధర్మప్రచారక్ గొల్లపొతు వెంకటేశ్వర్లు, బాల వికాస్ కేంద్రాల జిల్లా ఉపాధ్యాయ కన్వీనర్ అర్రిబోయిన రాంబాబు, సహ కన్వీనర్ చిలకపాటి సుధాకర్, మండల కన్వీనర్ చిమట సుధాకర్ పాల్గొన్నారు.

Related Posts

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

‎తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-13‎పార్వతీపురం మన్యం జిల్లా కొత్త కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్వస్థలం అయిన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని వెంగంపల్లెలో ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామంలో చిన్నా – పెద్దా అందరూ…

ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను కిర్లంపూడి లో శనివారం జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కలిశారు. ఈ సందర్భం గా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

  • By JALAIAH
  • September 14, 2025
  • 3 views
ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

  • By JALAIAH
  • September 14, 2025
  • 5 views
రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి