

ఉరవకొండ మన ధ్యాస: ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సమైక్య సాధన అధ్యక్షులు మూడ్ కేశవ నాయక్, రాష్ట్ర కురువ సంఘం ఉపాధ్యక్షులు కే లాలెప్ప వేరువేరు ప్రకటనలో డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు-ఉరవకొండ-తుమకూరు మరియు గుంతకల్లు-కళ్యాణదుర్గం-మడకశిర-మధుగిరి రైలు మార్గాల నిర్మాణానికి వారు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పూర్తిగా వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి రైలు మార్గాలు అత్యంత అవసరమన్నారు
ఈ నేపథ్యంలో, గుంతకల్లు నుండి ఉరవకొండ మీదుగా కర్ణాటకలోని తుమకూరు వరకు బ్రాడ్ గేజ్ రైలు మార్గం నిర్మించాలని కేశవ్ నాయక్, లాలెప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆర్థికమంత్రులను వారు డిమాండ్ చేశారు.
అదేవిధంగా, గుంతకల్లు నుండి కళ్యాణదుర్గం, మడకశిర మీదుగా కర్ణాటకలోని మధుగిరి వరకు మరో రైలు మార్గాన్ని కూడా నిర్మాణ ఆవశ్యకత ఉన్నట్లు తెలిపారు. ఈ రెండు మార్గాల నిర్మాణం ఈ ప్రాంత ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఇది ఉరవకొండ నియోజకవర్గంతో పాటు వందలాది గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఊతమిస్తుంది.
ఈ రైలు మార్గాల సాధన కోసం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా
పాలకుల దృష్టికి తీసుకొనివెళతామన్నారు.
. ఉరవకొండ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, ఈ ప్రాజెక్టును త్వరగా చేపట్టేందుకు పూర్తి శ్రద్ధ పెట్టాలని గిరిజన ఐక్య సాధన సమితి మూడు కేశవ నాయక్, రాష్ట్ర కురువ సంఘం ఉపాధ్యక్షులు లాలెప్పలు అభ్యర్థించారు..