

చిత్తూరు సెప్టెంబర్ 5 (మన ధ్యాస): చిత్తూరు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయము నందు ఉత్తమ ఉపాధ్యాయులు గా ఎంపికైన వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో విద్యారంగంలో విశిష్ట సేవలందించిన తవణంపల్లి మండలంలోని అరగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయాలజీ (పిజిటి జువాలజీ) ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న డాక్టర్ భూమ మదనయ్యను ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసి ఆయనను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, అలాగే చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేతుల మీదుగా సన్మానించి ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది. ఉత్తమ ఉపాధ్యాయుడిగా సన్మానం అందుకున్న డాక్టర్ భూమ మదనయ్యను పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.