మన న్యూస్ పూతలపట్టు ఆగస్ట్-21

పూతలపట్టులో అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం పూతలపట్టు మండల కేంద్రంలోని పోలీసు స్టేషను సమీపంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించబోయే నూతన అన్న క్యాంటీన్ భవనానికి పూతలపట్టు నియోజకవర్గం నాయకులతో కలిసి *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ.. పేదవాడి ఆకలి తీర్చడం, నిరుపేదలకు అతి తక్కువ ధరకే శుభ్రమైన ఆహారం అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా  చంద్రబాబునాయుడు
అన్న క్యాంటీన్లను స్ధాపించడం జరిగిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు స్ఫూర్తితో 2014లో నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలని తీర్చారని, అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం నిర్ధాక్షణంగా అన్న క్యాంటీన్లను నిర్వీర్యం చేసి పేదల కడుపును కాల్చిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి, ఐరాల మండల అధ్యక్షుడు గంగారపు హరిబాబు నాయుడు, తవణంపల్లి మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి, బంగారుపాలెం మండల అధ్యక్షులు ఎన్.పి. ధరణి నాయుడు, యాదమరి మండల అధ్యక్షులు మురార్జీ యాదవ్, పూతలపట్టు నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ గిరిధర్ బాబు మరియు పూతలపట్టు నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *