జలదంకి, సెప్టెంబర్ 27, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జలదంకి మండలంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల మండల సదస్సు ఆదివారం నిర్వహించారు. స్థానిక ఎంఆర్వో కార్యాలయ ఆవరణలో ఎంఎస్పీ మండల ఇన్‌చార్జి చెరుకూరి వెంకటేష్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ జిల్లా ఇన్‌చార్జి మంద వెంకటేశ్వరరావు మాదిగ, ఎంఎస్పీ జిల్లా ఇన్‌చార్జి పందిటి అంబేద్కర్ మాదిగ, గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ కలను నెరవేర్చిన మహనీయుడు మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. భవిష్యత్తులో రాజ్యాధికారమే లక్ష్యంగా మాదిగలు పయనించాలని, అందుకు ఇప్పటి నుండే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 6న ఎంఎస్ఎఫ్ జాతీయ సదస్సు జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే జలదంకి మండలంలో నూతన మండల కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.నూతన కమిటీలు :
ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడిగా చవలమూడి హజరత్ మాదిగ, అధికార ప్రతినిధిగా గోచిపాతల క్రాంతి మాదిగ, ప్రధాన కార్యదర్శిగా పందిటి ప్రవీణ్ మాదిగ, ఉపాధ్యక్షులుగా శెట్టిపల్లి వినయ్ మాదిగ, గోచిపాతల మాధవ మాదిగ, కోశాధికారిగా దేవరపల్లి బాబు మాదిగ, కార్యదర్శిగా కర్రా శ్రీను మాదిగ ఎన్నికయ్యారు.ఎంఎస్పీ మండల అధ్యక్షుడిగా కూచిపాటి మస్తాన్ బాబు మాదిగ, అధికార ప్రతినిధిగా పాజర్ల తిరుపాలు మాదిగ, ప్రధాన కార్యదర్శిగా పందిటి కరుణా మాదిగ, ఉపాధ్యక్షుడిగా గోచిపాతల సుమన్ మాదిగ ఎన్నికయ్యారు.ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షుడిగా శెట్టిపల్లి శివకోటయ్య మాదిగ, అధికార ప్రతినిధిగా మంగళ శ్రీనాథ్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా పందిటి శ్రీనాథ్ మాదిగ, ఉపాధ్యక్షులుగా కప్పల నవీన్ మాదిగ, పందిటి శ్రీనివాస్ మాదిగ, కోశాధికారిగా సూరిపోగు అరుణ్ మాదిగ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ సీనియర్ నాయకులు రావినూతల చినరాములు, దేవరపల్లి కొండయ్య, డి.మాధవ, టి.రామయ్య, సీహెచ్ అనిల్, డి.మాల్యాద్రి, ఎం.కోటేష్, జయకృష్ణ మాదిగ తదితరులు, జలదంకి మండలంలోని అన్ని గ్రామాల నుండి మాదిగ పెద్దలు, యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *