

నర్వ మండలం మన న్యూస్ :- తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి ధాన్యం ఇచ్చిన రైతులకు ఇప్పటివరకు బోనస్ డబ్బులు అందకపోవడం ఎంతో బాధాకరమైన అంశం. పంటను సేకరించాక ఎంతో ఆశతో ప్రభుత్వం ప్రకటించిన బోనస్ కోసం ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే మిగిలింది.ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమైంది. రైతులు పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో గత సీజన్లో అమ్మిన ధాన్యం బోనస్ డబ్బులు ఇప్పటికీ అందకపోవడం వల్ల వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై స్పందించి, మిగిలిన బోనస్ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి విడుదల చేయాలని మా విన్నపం. ఇది కేవలం ఒక్క రైతు సమస్య కాదు… ఇది రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతుల జీవితాలతో నేరుగా ముడిపడిన అంశం.రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.