గూడూరు, మన న్యూస్ :- పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్
ఆధ్వర్యం లో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సహకారంతో గూడూరు టౌన్ హాల్ లో ఏర్పా టు చేశామని మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరిశంకర్, సీఈవో సీతారామ నాయుడు గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలకు సీనియర్ కంటి వైద్య నిపుణులైన అనుభవం గల స్పెషలిస్ట్ డాక్టర్లు మరియు వారి బృందం ఆధ్వర్యంలో 255 మంది కి పరీక్షలను ఉచితముగా నిర్వహంచి 70 మంది కి ఉచితముగా మందులు పంపిణీ, 55 రోగులకు ఉచిత కంటి అద్దాలు, 80 మంది కి ఉచితంగా ఆపరేషన్ లు చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ ఉచిత భోజనం వసతి కల్పించారు. ప్రతినెల నాలుగవ గురువారం ఉచిత కంటి వైద్య పరీక్షలు గూడూరు పట్టణంలో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జరుగుతాయని తెలిపారు. నెల్లూరు తిరుపతి జిల్లాలోని ప్రతి మండల కేంద్రాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సదుపాయాన్ని కంటి సమస్యలతో బాధపడేవారు అందరూ ఉపయోగించుకోవాలని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ AOకృష్ణ గల్లా,
అరవింద్ నేత్రలయ సిబ్బంది జీవన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *