యువతే భారతదేశానికి వెన్నెముక,వారి భవిష్యత్తే దేశ ప్రగతి
- *ఉద్యోగాలు అడిగే వారు కాదు.. ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలి: తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతి ఆగష్టు 15.
స్థానిక నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ:విద్యార్థులు చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోని, చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఎదురుచూసే వారిలా కాకుండా, పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగేలా ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు.రాబోయే 7 నుండి 8 సంవత్సరాలు (ఇంటర్, డిగ్రీ/బీటెక్) విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమన్న ఆయన,ఈ ఏడేళ్లు కష్టపడితే, మిగిలిన 70 ఏళ్ల జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు.ఈ సమయంలో ఏకాగ్రత కోల్పోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.సొంత కుటుంబం కంటే విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఎక్కువ సమయం కేటాయించే ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ దైవసమానులుగా గౌరవించాలి అని విద్యార్థులకు తెలిపారు.ప్రస్తుతం 15 సెకన్ల రీల్స్ వల్ల విద్యార్థుల జ్ఞాపకశక్తి దెబ్బతింటోందని,స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని వీలైనంత తగ్గించి,ఆన్లైన్ ప్రపంచంలో మన వ్యక్తిగత గోప్యత ఉండదని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు,అన్ని రంగాల్లో చురుకుగా పాల్గొని,గెలుపు ఓటముల తో సంబంధం లేకుండా పోటీల్లో పాల్గొనడం అలవాటు చేసుకోని,మనసును ఒక ఆయుధంలా పదును పెట్టుకోవాలి అని సూచించారు.స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకుని,విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరియు వారి తల్లిదండ్రులు విశేషంగా పాల్గొన్నారు.


