- ఉత్సాహంగా పాల్గొన్న తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.
- ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు, హాజరైన జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు.
తిరుపతి ఆగష్టు 15. భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘హై టీ’ (ఎట్ హోమ్) కార్యక్రమం అత్యంత వైభవంగా, ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది.ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ‘హై టీ’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన దేశభక్తి పూరిత సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.విద్యార్థులు, స్థానిక కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు మరియు గీతాలాపనలు అందరిలోనూ జాతీయ భావాన్ని, స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించాయి.జాతీయ సమైక్యతను చాటిచెప్పేలా సాగిన ఈ ప్రదర్శనలు ఈ సాయంత్రం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.జిల్లా కలెక్టర్ వారి ఆతిథ్యంలో జరిగిన ఈ వేడుకలో తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ స్థాయి నాయకులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, రెవెన్యూ, పోలీసు శాఖల ఉన్నతాధికారులు మరియు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు. వేడుకలకు హాజరైన అధికారులందరూ, ప్రజాప్రతినిధులు ఒకరికొకరు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఉన్నతాధికారులు, నాయకులు, మరియు నగర ప్రముఖులు ఒకే వేదికపై కలుసుకుని ముచ్చటించుకోవడానికి ఈ ‘హై టీ’ వేదికగా నిలిచింది.



