కలిగిరి, ఆగస్టు 15, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటర్ల అవగాహన కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు కావలి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో చేతుల మీదుగా కలిగిరి తాసిల్దార్ గిరీష్ మొలతాటి కి ఉత్తమ ప్రతిభ అవార్డు లభించింది.ఈ సందర్భంగా తహసీల్దార్ గిరీష్ మొలతాటి మాట్లాడుతూ,ఓటర్ల జాబితా నిర్వహణలో బూత్ లెవల్ అధికారులు బి ఎల్ వో లు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నిర్దేశిత గడువులోగా ఓటర్ల వివరాలను పరిశీలించి, క్రమ సంఖ్యల వారీగా సమగ్రంగా నమోదు చేయడంతో పాటు అవసరమైన సమాచారాన్ని సంబంధిత శాఖకు సకాలంలో అందజేయాలని తెలిపారు.ఓటర్లకు సంబంధించిన సమస్యలు, అవాంఛనీయ ఘటనలు లేదా ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు సంబంధిత సచివాలయ సిబ్బంది సమన్వయంతో వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించడంలో మీడియా మిత్రులు కూడా తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు.