

మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలంలోని పాకాల మరియు ఊళ్ళపాలెం గ్రామాలలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం మంగళవారం నాడు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి. పూర్ణచంద్రరావు పాల్గొని రైతులకు అవసరమైన మార్గదర్శకాలను అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన గ్రీవెన్స్ దాఖలుకు ఈ నెల 23వ తేదీ వరకు అవకాశం కల్పించబడిందని, రైతు సేవా కేంద్రాలలోని గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా రైతులు తమ వివరాలను అర్హుల జాబితాలో పరిశీలించుకోవాలని, జాబితాలో పేరు లేకపోతే తప్పకుండా గ్రీవెన్స్ పెట్టాలని సూచించారు.అదేవిధంగా, వరి పంటలో ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ చర్యలపై సమగ్రమైన సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి షేక్ జహీర్, గ్రామ వ్యవసాయ సహాయకులు ఎం. అరుణ్ చంద్, ఎం. భవాని, సిహెచ్. శారద, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వెంకటరమణ, గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
