

మన న్యూస్ సింగరాయకొండ:- మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సింగరాయకొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మంగళవారం సుందర్నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేశారు. సుమారు రూ.3,000 విలువగల నోటుపుస్తకాలు, పలకలు తదితర సామాగ్రిని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మానవత జిల్లా కమిటీ సభ్యులు ఎం.వి. రత్నం గారు పాల్గొని, విద్యార్థులంతా బాగా చదివి భవిష్యత్తు సాధించాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మానవత మండల శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు.కార్యక్రమంలో మానవత సింగరాయకొండ మండల శాఖ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పూర్ణచంద్రరావు, ట్రెజరర్ మహంకాలి నరసింహారావు, టీవీటీ రవిచంద్ర, ఉపాధ్యాయులు ఎస్కే ఆశా బేగం, కె. కామాక్షి పాల్గొన్నారు.