

మన న్యూస్ తవణంపల్లె జులై-15
తవణంపల్లి మండల పరిధిలోని దిగువ మాగం గ్రామంలో ఉదయం 11 గంటలకు ఆర్డిఓ తాసిల్దార్ సుధాకర్ దిగువమాగం గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గళ్ళ అరుణ కుమారి కుమార్తె రమాదేవి ఆమె సొంత సెటిల్మెంట్ 4 సెంట్లు భూమిని గ్రామస్తులు వీధుల వెడల్పు చేయుటకు గ్రామానికి గ్రామ సౌకర్యం కోసం భూమిని ఇవ్వడం జరిగింది. అందుకాను గ్రామకంఠం 2 సెంట్లు భూమిని ఆర్డీవో ఆదేశాల మేరకు తవణంపల్లి మండల తాసిల్దార్ సుధాకర్ సహకారంతో గల్లా అరుణ్ కుమారి కుమార్తె రమాదేవి గ్రామానికి ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విఆర్ఓ ఆర్ఐ గ్రామస్తులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
