

ఉరవకొండ మన న్యూస్: జై కిసాన్ ఫౌండర్ ఆధ్వర్యంలో ఒక రోజు వ్యవసాయ శిక్షణ కార్యక్రమం విజయవంతం గా ముగిసింది.
ఉద్యానవన శాఖ డిడిహెచ్ శ్రీమతి.ఉమాదేవి ఉద్యాన పంటల గురించి &రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలు గురించి సవివరంగా వివరించారు ,అలాగే డ్రిప్లు స్ప్రింక్లర్ల ఆవశ్యకత గురించి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ వివరాలు గురించి ఏపీఎంఐపీ పిడి శ్రీ రఘునాథ్ రెడ్డి వివరించారు..రేకులు కుంట అగ్రికల్చర్ రిసోర్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త శ్రీ విజయ్ శంకర్ బాబు మెట్ట పంటల గురించిశిక్షణ ఇచ్చారు. .అగ్రికల్చర్ రిసోర్ స్టేషన్ శాస్త్రవేత్త శ్రీమతి మాధవి లత మేడం మిల్లెట్స్ గురించి శిక్షణ ఇచ్చారు…తదుపరి కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణ్ దుర్గం నుంచి శాస్త్రవేత్త వచ్చిన శాస్త్రవేత్త డాక్టర్ యుగేందర్ గారు మిరప పంట మరియు వాటి యాజమాన్య పద్ధతులు గురించి వివరించి శిక్షణ ఇచ్చారు..అలాగే ఉరవకొండ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎస్ సత్యనారాయణ వ్యవసాయ శాఖ సబ్సిడీలు గురించి పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాల గురించి వివరించారు,భోజనానంతరం రక్షణ భారతదేశ ప్రకృతి వ్యవసాయాన్ని పనులు బసంపల్లి నాగరాజు ప్రకృతి వ్యవసాయం యొక్క ఆవశ్యకత గురించి శిక్షణ ఇచ్చారు,తదుపరి బాయిర్ క్రాప్ సైన్స్ సిసిఎం ఎం.చేతన్ గారు బాయర్ కంపెనీ ఉత్పత్తుల గురించి శిక్షణ ఇచ్చారు..ఈ కార్యక్రమానికి ఉరవకొండ నియోజకవర్గం నుంచి దాదాపుగా 200 రైతు దంపతులు అంటే సుమారుగా 400 మంది రైతు సోదరులు ఈ కార్యక్రమానికి వచ్చి శిక్షణ తీసుకోవడం జరిగింది తదుపరి శిక్షణ అనంతరం మహిళా రైతులకు పసుపు కుంకుమ మరియు బహుమతి ప్రధానం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎరిస్ కంపెనీ,బాయిర్ కంపెనీ మరియువినూత్న ఆగ్రోటెక్ కంపెనీలు స్టాల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి..ఈ కార్యక్రమంలో జై కిసాన్ ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి రజిని కుమారి,నాగమల్లి మనస్వి,చరణ్,శ్రీమతి లావణ్య,నిరంజన్ గౌడ్,బసవరాజు ఉరవకొండ అగ్రికల్చర్ ఆఫీసర్ రామకృష్ణుడు పాల్గొన్నారు.
